భారతదేశం, ఫిబ్రవరి 5 -- మైదానంలో దూకుడుగా ఆడే ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. సోషల్ మీడియాలోనూ అంతే చురుగ్గా ఉంటాడు. గురువారం (ఫిబ్రవరి 5) అతడు తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఒక ఫొటో క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ట్రైనింగ్ సమయంలో క్రికెట్ బంతి బలంగా తాకడంతో స్టోక్స్ ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి.
షేర్ చేసిన ఫొటోలో.. బెన్ స్టోక్స్ కుడి కంటి కింద కమిలిపోయి వాచిపోవడాన్ని చూడవచ్చు. చెంపపై కోసుకుపోయిన గాయం, రక్తం కారకుండా ముక్కులో దూది పెట్టుకుని అతడు కనిపిస్తున్నాడు. ఇంతటి నొప్పిలోనూ అతడు తన సెన్సాఫ్ హ్యూమర్ను వదులుకోలేదు. "నా ముఖం ఇలా ఉంది సరే.. ఆ క్రికెట్ బంతి పరిస్థితిని మీరు చూడాలి" అంటూ నవ్వుతున్న ఎమోజీతో క్యాప్షన్ రాసుకొచ్చాడు.
బెన్ స్టోక్స్ గాయపడటం ఇంగ్లాండ్ అభిమానులకు ఆందోళన కలిగిస్తున్నా.. అతడు తిరిగి ప్రాక్టీస్ మొదల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.