భారతదేశం, ఆగస్టు 22 -- చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. వాస్తు ప్రకారం పాటిస్తే ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి వ్యాపిస్తుంది.

వాస్తు ప్రకారం, చైనీస్ ఫెంగ్‌షుయ్‌ ప్రకారం ఇంట్లో శక్తికి, మన దైనందిన జీవన విధానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మనం నిద్రించే స్థానం, నిద్రించే దిశ మానసిక ప్రశాంతత, సానుకూల శక్తిపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా బెడ్‌రూమ్‌లో మంచాన్ని ఏర్పాటు చేసేటప్పుడు కొన్ని వాస్తు నియమాలను పాటించాలి.

తలుపుకు ఎదురుగా మంచం ఉంచి నిద్రించడం మంచిది కాదు. ఇలా చేస్తే శక్తి నేరుగా బయటకు వెళ్లిపోతుంది. పురాతన కాలంలో మృతదేహాన్ని తలుపుకి ఎదురుగా ఉంచేవారు. అందుకని దీనిని అశుభంగా భావిస్తారు. కానీ ఈ నమ్మకాలకు శాస్త్రీయ ఆధారాలు లేవు.

వాస్తు ప్రకారం నిద్రించే దిశ కూడా...