భారతదేశం, సెప్టెంబర్ 24 -- బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక ఆపరేషన్ చేపట్టింది తెలంగాణ సీఐడీ. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్‌లలో విస్తృతంగా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్‌ను గుర్తించింది. ఎనిమిది మంది ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వాహకులను అరెస్టు చేసింది. ఈ మూడు రాష్ట్రాల్లోని ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.. 8 మందిని అరెస్ట్ చేసింది. ఈ సోదాల్లో భారీ డేటాతో ఉన్న అనేక హార్డ్‌వేర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టుగా సీఐడీ వెల్లడించిది. అంతేకాదు విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడిని గుర్తించడానికి దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించింది.

ఇప్పుడు అరెస్ట్ అయిన ఎనిమిది మంది తెలుగు 365, ఆంధ్ర 365, యాస్ 365, తాజా 007, వీఎల్ బుక్, ఫైర్ ప్లే లైవ్ అనే ఆరు బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నట్టుగా సీఐడీ గుర్తించింది.

'ఈ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వేలాది మంది వి...