భారతదేశం, మే 2 -- పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ, అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను, పీఎస్‌యూ (PSU) సిబ్బందిని కౌంటింగ్ సూపర్‌వైజర్లుగా నియమించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. శనివారం జరిగిన విచారణలో ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్ చట్టబద్ధమేనని కోర్టు తేల్చి చెప్పింది.

జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ జైమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ కీలక అంశంపై విచారణ చేపట్టింది. కౌంటింగ్ సిబ్బందిని ఎంపిక చేసే పూర్తి అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

"కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులనే ...