భారతదేశం, అక్టోబర్ 8 -- "నేను ఇక్కడ ప్రభుత్వం మార్చడానికి రాలేదు" అని ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) విధానాన్ని నిరసిస్తూ, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో గురువారం భారీ ధర్నా జరిగింది. కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ధ్రువ్ రాఠీ, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ పాల్గొని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ధర్నాలో ప్రసంగించిన ధ్రువ్ రాఠీ, ప్రస్తుత ఎన్నికల సంఘం నిర్వహణలో ఏమాత్రం పారదర్శకత, బాధ్యతారాహిత్యం కనిపించడం లేదని ఆరోపించారు. "మా పోరాటం ఏ ఒక్క ప్రభుత్వాన్ని కూల్చడానికి కాదు, పౌరుల రాజ్యాంగ హక్కులను, ఓట...