భారతదేశం, ఏప్రిల్ 27 -- కృత్రిమ మేధ (AI) రంగంలో రారాజుగా వెలుగుతున్న ఎన్విడియా, భారత ఐటీ రాజధాని బెంగళూరులో తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. నగరం నడిబొడ్డున ఉన్న 'బాగ్మనే క్యాపిటల్' ప్రాజెక్టులో ఏకంగా 7.6 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని ఈ సంస్థ లీజుకు తీసుకుంది. రాబోయే పదేళ్ల కాలానికి గాను ఈ లీజు ఒప్పందం విలువ సుమారు రూ. 1,230 కోట్లుగా ఉండటం విశేషం.
ప్రాప్‌స్టాక్ (Propstack) సేకరించిన డాక్యుమెంట్ల ప్రకారం, ఎన్విడియా అనుబంధ సంస్థ 'ఎన్విడియా గ్రాఫిక్స్ ప్రైవేట్ లిమిటెడ్' ఈ ఒప్పందంపై సంతకం చేసింది. బాగ్మనే క్యాపిటల్‌లోని మెమ్ఫిస్ సౌత్ టవర్‌లో మొత్తం 12 అంతస్తులను కంపెనీ లీజుకు తీసుకుంది.
ఇటీవలే అంతర్జాతీయ మార్కెట్లో 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌ను దాటి సరికొత్త చరిత్ర సృష్టించిన ఎన్విడియా, భారత్‌లో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.