భారతదేశం, మే 9 -- Jupiter transit 2026 : జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన, శుభప్రదమైన గ్రహంగా భావించే బృహస్పతి (గురువు) తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. ఒక రాశిలో సుమారు ఏడాది పాటు ఉండే గురువు... ఈ ఏడాది 'అతిచారం' (వేగంగా రాశి మారడం) వల్ల తక్కువ సమయంలోనే మూడు రాశుల్లో సంచరించబోతున్నాడు.

ఈ ఏడాది జనవరిలో మిథున రాశిలోకి ప్రవేశించిన బృహస్పతి.. జూన్ 2వ తేదీన తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటకంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అనంతరం అక్టోబర్ 31న సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు.

గురువు తన స్వక్షేత్రం లేదా ఉచ్ఛ రాశిలో ఉన్నప్పుడు అత్యంత బలమైన ఫలితాలను ఇస్తాడు. కర్కాటక రాశిలో గురువు సంచారం వల్ల సమాజంలో ధర్మం, ఆర్థిక స్థిరత్వం పెరుగుతాయి. అయితే, మధ్యలో ఒక నెల రోజుల పాటు గురు గ్రహం తన శక్తిని కోల్పోయే అవకాశం ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

ఈ ఏడాది జూలై 14 నుండి ఆ...