భారతదేశం, ఆగస్టు 12 -- బలహీనమైన త్రైమాసిక ఫలితాలు ఉన్నా.. టిటాగర్ రైల్ సిస్టమ్స్ షేర్లు మంగళవారం మెుదట 5.2 శాతం పెరిగాయి. బీఎస్ ఈలో కంపెనీ షేరు ఇంట్రాడే గరిష్ఠ స్థాయి రూ.818ను తాకింది. మంగళవారం ఉదయం కంపెనీ షేరు స్వల్ప నష్టంతో రూ.775 వద్ద ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషాలకు 3.07 శాతం పెరిగి రూ.800గా ఉంది. సోమవారం మార్కెట్ ముగిశాక ఈ కంపెనీ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

ఏడాది ప్రాతిపదికన నికర లాభం 54 శాతం పడిపోయిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో టిటాగర్ తెలిపింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు కంపెనీ నికర లాభం రూ.30.86 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.67.01 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కంపెనీ ఆదాయం (ఆపరేషన్స్) రూ.679.30 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో ఇది రూ.903.05 కోట్లుగా ఉంది.

టిటాగర్‌కు రూ.2469...