భారతదేశం, జూలై 6 -- Sumona Chakravarti About Endometriosis Surgery: 'ది కపిల్ శర్మ షో' ద్వారా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న నటి సుమోనా చక్రవర్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గత రెండు నెలలుగా సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటున్న ఆమె, తాజాగా తన ఆరోగ్య పరిస్థితిపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘమైన ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

మహిళల్లో గర్భాశయానికి సంబంధించి వచ్చే ప్రమాదకరమైన 'స్టేజ్ 4 ఎండోమెట్రియోసిస్' (Endometriosis) వ్యాధి ముదరడంతో మే 4వ తేదీన తనకు సర్జరీ జరిగిందని సుమోనా వెల్లడించారు. ఎంతో కాలంగా ఈ సమస్యను నియంత్రించడానికి మందులు వాడుతున్నప్పటికీ పరిస్థితి విషమించడంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని చెప్పారు.

మన తెలుగు రాష్ట్రాల్లోనూ కపిల్ శర్మ ఓటీటీ కామెడీ షో చూసే ప్రేక్షకులకు సుమోనా చక్రవర్తి సుపరిచితమే. స్క్రీన్‌...