భారతదేశం, ఫిబ్రవరి 21 -- తెలుగు వినోద రంగంలో అగ్రగామి ఛానెల్‌గా జీ తెలుగు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వినూత్న, ఉత్కంఠభరితమైన కార్యక్రమాలు, సీరియల్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఇటీవలే ఆట డ్యాన్స్​ రియాలిటీ షో సరికొత్త సీజన్​‌ను ఘనంగా ప్రారంభించింది.

కొత్త మలుపులు, స్టార్ గెస్ట్‌లు, అద్భుత ప్రదర్శనలతో ఆట డ్యాన్స్ రియాలిటీ షో న్యూ సీజన్‌ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. ఈ వారం మరిన్ని ట్విస్ట్‌​లు, సర్‌ప్రైజ్‌లతో వచ్చేస్తున్న ఆట డ్యాన్స్​ షో ప్రతి శని, ఆదివారాలు రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానున్నాయి.

అయితే, టీవీ ప్రసారానికి 48 గంటల ముందే గురు, శుక్రవారాల్లో జీ5 ఓటీటీలో కొత్త ఎపిసోడ్‌లు అందుబాటులో ఉంటాయని మేకర్స్ తెలిపారు. అంటే టీవీతోపాటు ఓటీటీలోనూ ఆట డ్యాన్స్ రియాలిటీ షోను ఎంచక్కా చూసేయొచ్చు. ఇకపోతే ఆట సరికొత...