భారతదేశం, ఆగస్టు 5 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యువరాజుగా పరిగణించే బుధుడు తన సంచారాన్ని మార్చడం ద్వారా సమస్త రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాడు. వాక్కు, వ్యాపారం, మేధస్సు, కమ్యూనికేషన్‌కుకారకుడైన బుధుడు తాజాగా చంద్రుడి ఆధిపత్యం గల కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఆగస్టు 5న సాయంత్రం 7:58 గంటలకు మొదలైన ఈ బుధ గోచరం ఆగస్టు 22 సాయంత్రం వరకు కొనసాగనుంది.

గ్రహాల ఈ కలయిక కారణంగా వివిధ రాశుల వారు తమ జాతకంలో సానుకూల మార్పులను గమనించవచ్చు. ప్రముఖ జ్యోతిష్యులు పండిత్ నరేంద్ర ఉపాధ్యాయ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ గోచరం ఏయే రాశుల వారికి ఎలా కలిసి వస్తుందో ఇక్కడ పరిశీలిద్దాం.

బుధుడి కర్కాటక సంచారం కన్య రాశి వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా విద్యారంగంలో రాణించాలనుకునే స్టూడెంట్స్‌కు ఇది సరైన సమయం. పరీక్షల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి. సమాజ...