భారతదేశం, జూలై 22 -- జ్యోతిషశాస్త్రంలో బుధుడికి అత్యంత ప్రాధాన్యత ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. బుధ గ్రహాన్ని వివేకం, వాక్చాతుర్యం, విద్య, వ్యాపారం, కమ్యూనికేషన్ మరియు తార్కిక ఆలోచనా శక్తికి ప్రతీకగా పండితులు పరిగణిస్తారు. జులై 24వ తేదీన బుధుడు తన కదలికను మార్చుకోనున్నాడు.

సాధారణంగా బుధుడు తిరోగమనం చెందినప్పుడు చాలామంది నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర తడబాటుకు గురవుతారు. ఉద్యోగాల్లో అపార్థాలు రావడం, వ్యాపార లావాదేవీల్లో అడ్డంకులు ఏర్పడటం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే.. జులై 24న బుధుడు తిరిగి నేరుగా సంచరించటం ప్రారంభించగానే. ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి.

బుధుడి రుజుమార్గ ప్రయాణం వల్ల జాతకంలో స్పష్టత పెరుగుతుంది. సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా కార్పొరేట్, వ్యాపార, సాంకేతిక మరియు కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేసే వారికి...