భారతదేశం, సెప్టెంబర్ 19 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి మార్పుతో పాటు నక్షత్ర మార్పులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. నవగ్రహాల్లో శుభ గ్రహంగా, జ్ఞానం, సంతానం, సంపదలకు కారకుడిగా భావించే దేవగురు బృహస్పతి (గురుడు) ప్రస్తుత కాలంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నారు. ఈ క్రమంలో బుధుడికి చెందిన ఆశ్లేష నక్షత్రంలోకి బృహస్పతి ప్రవేశిస్తున్నారు.

హిందూ పంచాంగం ప్రకారం... ఆశ్లేష నక్షత్రం మూడో పాదంలో గురుడి నక్షత్ర సంచారం జరగనుంది. అనంతరం అక్టోబర్ 8న గురుడి నక్షత్ర పాదం మళ్లీ మారుతుంది. బుధుడి నక్షత్రమైన ఆశ్లేషలోకి గురుడు ప్రవేశించడంతో పాటు తన వేగాన్ని మార్చుకోవడం వల్ల మొత్తం 12 రాశులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రఖ్యాత జ్యోతిష్య పండితులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నక్షత్ర పరివర్తనం వల్ల రేపటి నుంచి రాబోయే 18 రోజుల పాటు ఏకంగా 7 రా...