భారతదేశం, ఆగస్టు 19 -- ప్రతిరోజు గ్రహాల కదలికలు, నక్షత్రాల స్థితిగతుల ఆధారంగా జ్యోతిష్య నిపుణులు రాశిఫలాలను అంచనా వేస్తారు. ఆగస్టు 19వ తేదీ బుధవారం కావడంతో హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం విఘ్నేశ్వరుడైన గణనాథుడి పూజకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. బుధవారం రోజున ఆ వినాయకుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల విఘ్నాలు తొలగిపోయి జీవితంలో సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు.

గ్రహాల గమనం ప్రకారం ఈరోజు కొన్ని రాశుల వారికి అద్భుతమైన లాభాలు చేకూరనుండగా, మరికొన్ని రాశుల వారు మాత్రం ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారి బుధవారం నాటి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ పూర్తిగా పరిశీలిద్దాం.

ఈరోజు మీ ప్రేమ జీవితంలో సరికొత్త సానుకూలత సంతరించుకుంటుంది. భాగస్వామితో గడిపే క్షణాలు మనసుకి ప్రశా...