Hyderabad, ఆగస్టు 10 -- పరమాత్మ జీవుల హృదయంలో బుద్ధిరూపంలో ఉంటాడు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. కఠోపనిషత్తులో యముడు ఈ శరీరం రథం వంటిది. కర్మ ఫలాన్ని అనుభవించే జీవాత్మ దాని యజమాని, బుద్ధే సారథి. మనస్సే కళ్ళెం. ఇంద్రియాలే గుర్రాలు. విషయమే మార్గము అని చెబుతాడు.

పరమేశ్వరుడు హృదయంలో బుద్ధిరూపంలో ఉంటాడు. అందుకే అతన్ని 'మహాబుద్ధి' అంటారు. అతడు గొప్ప జ్ఞాని. ఏమాత్రమూ సంశయం లేనటువంటి మహత్తరమైన జ్ఞానమే స్వరూపముగా గలవాడు. ఈ జ్ఞానము అన్ని దేశాలయందు, అన్ని కాలాలయందు, అన్ని స్వభావములందు, అన్నింటియందు ఉంటే వాటిని నిగ్రహిస్తుంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

లోకంలో ఎక్కడ ఏ మూల ఏం జరిగినా మరుక్షణంలో పరమేశ్వరుడికి అది తెలుస్తుంది. అ...