భారతదేశం, నవంబర్ 10 -- బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోరు మరింత ఆసక్తిగా మారుతోంది. మొదటి దశలో రికార్డు స్థాయిలో 65.08 శాతం పోలింగ్ నమోదు కాగా, నవంబర్ 11న రెండో దశ పోలింగ్ జరగనుంది. ఈ దశలో మొత్తం 20 జిల్లాల పరిధిలోని 122 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. 3 కోట్ల 70 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఈ రెండో దశ ఎన్నికలే.. బీహార్‌లో అధికారం ఎవరికి దక్కుతుందో నిర్ణయించే అత్యంత కీలకంగా మారాయి. ఇక్కడ ప్రధాన పార్టీల కంటే కూడా, వారి మిత్ర పక్షాల ప్రదర్శనే ఫలితాలను తారుమారు చేయనుంది. ఈ దశలో చిన్న పార్టీలకు ఎక్కువ సీట్లు కేటాయించడం, వాటిపై అధికారం ఆధారపడి ఉండడం ఈ ఎన్నికల్లో కీలక అంశం.

ఎన్డీయే కూటమిలో ఈసారి చిన్న పార్టీలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా దళిత, బీసీ వర్గాల నేతలకు కేటాయించిన సీట్లలో గెలుపు కీలకంగా మార...