Telangana,delhi, ఆగస్టు 6 -- బీసీ రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీ జంతర్ మంతర్ లో తెలంగాణ కాంగ్రెస్ దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.ఈ దీక్షకు కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగోయ్, జ్యోతిమణి సెన్నిమలై, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎస్పీ, శివసేన, ఎన్సీపీ ఎంపీలు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ధర్నా చేస్తున్నామన్నారు. రోడ్డుపై ధర్నా చేస్తున్నా బీజేపీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమనే విషయం అర్థమవుతోందన్నారు.పార్లమెంటులో బీసీ బిల్లుపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లుపై రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరామని. ఇప్పటి వరకు సమాధానం రాల...