Telangana,hyderabad, అక్టోబర్ 11 -- బీసీ రిజర్వేషన్లపై జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వటంతో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడినట్లు అయింది. ఎన్నికల సంఘం కూడా నోటిఫికేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై కసరత్తు చేస్తోంది. హైకోర్టు ఇచ్చిన స్టే సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైంది.

జీవో 9, ఎన్నికల నోటిఫికేషన్‌ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రేేవంత్ సర్కార్ నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సోమవారం పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయి.

హైకోర్టు తీర్పు కాపీ శుక్రవారం అందుబాటులోకి రాగా. ప్రభుత్వం పూర్తిస్థాయిలో స్టడీ చేసినట్లు తెలిసింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని. సీనియర...