భారతదేశం, ఆగస్టు 15 -- భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్(BSNL) ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా స్వదేశీ 4జీ నెట్‌వర్క్ విస్తరణ, శాటిలైట్ కమ్యూనికేషన్, అత్యాధునిక డిజిటల్ సేవల అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రణాళికలను వెల్లడించింది. బీఎస్‌ఎన్‌ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం. శేషాచలం ఈ వివరాలను పంచుకున్నారు. ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీని బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మొబైల్, ఫైబర్ (FTTH) వినియోగదారుల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ ఆకర్షణీయమైన ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది.

రూ.1 ఫ్రీడమ్ 2.0 ఆఫర్ (Freedom 2.0 Offer): ఈ రీఛార్జ్ ద్వారా రోజుకు 1 GB డేటా, 100 SMSలు, అపరిమిత కాలింగ్ సౌకర్యం లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 24 రోజులు. రూ. 2,39...