Telangana, సెప్టెంబర్ 21 -- టీజీ ఎడ్ సెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కౌన్సెలింగులు పూర్తి అయ్యాయి. దీంతో అధికారులు స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదల చేశారు. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు. సీట్లు ఖాళీగా ఉన్న కాలేజీల్లో నేరుగా చేరవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులు ఓ ప్రకటన ద్వారా ప్రకటించారు.

ఈనెల 23వ తేదీన కాలేజీల వారీగా సీట్ల ఖాళీల వివరాలను ప్రకటిస్తారు. వీటిని https://edcetadm.tgche.ac.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతారు. ఈనెల 25వ తేదీన కాలేజీల ద్వారా నోటిఫికేషన్ ఇస్తారు. ఈనెల 30వ తేదీన స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను చేపడుతారు.

స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ రిజిస్ట్రేషన్ కోసం ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 800 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే రూ. 500 చెల్లించాలి. https://e...