Telangana, ఆగస్టు 10 -- బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎడ్ సెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. వెబ్ ఆప్షన్లు, ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయించనున్నారు. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు పూర్తి కావటంతో. ఇవాళ సీట్లను కేటాయించనున్నారు.

ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందిన విద్యార్థులు 11 ఆగస్టు 2025 నుంచి రిపోర్టింగ్ చేయవచ్చు.ఇందుకు 14 ఆగస్టు 2025 తేదీని తుది గడువుగా నిర్ణయించారు.18 ఆగస్టు 2025 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

తెలంగాణ ఎడ్ సెట్ పరీక్షలు జూన్‌ 1వ తేదీన జరిగాయి. మొదటి షెషన్‌ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షను నిర్వహించారు.

ఈసారి జరిగిన ఎడ్‌సెట్‌ కు 38,754 మంది దరఖాస్తు చేసుకోగా 32,106 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 30,944 మంది అభ్యర్థులు అర్హత సాధిం...