భారతదేశం, మార్చి 2 -- రెండుమూడు రోజులుగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు పేరుతో వీడియో క్లిప్పింగ్స్‌పైనే రాజకీయ నడుస్తోంది. వైసీపీ సోషల్ మీడియా ఆ వీడియోలను ఎక్కువగా వైరల్ చేస్తోంది. అంతేకాదు ఆ పార్టీ ముఖ్యనేతలు సైతం ఈ విషయంపై మాట్లాడుతున్నారు. టీటీడీ ఛైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోలు డీప్ ఫేక్ అని బీఆర్ నాయుడు క్లారిటీ ఇచ్చారు.

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో వీడియోలలో కనిపించిన మహిళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్‌లకు వివరణాత్మక లేఖ రాసి, ఆయనతో తనకున్న అనుబంధం గురించి వివరించిందని వైఎస్సార్సీపీ తెలిపింది. ఈ మేరకు వైసీపీ సోషల్ మీడియాలో ఓ లేఖను పోస్ట్ చేసింది.

ఆ లేఖలో ఆమె 30 ఏళ్ల అనుబంధం గురించి మాట్లాడిందని, అది సంబంధంగా మారిందని, భావ...