భారతదేశం, సెప్టెంబర్ 9 -- తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మంగళవారం నాటకీయ పరిణామాల మధ్య ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు. వారిని శాసనమండలి నుంచి సస్పెండ్ చేశారు. ఇదే సమయంలో అసెంబ్లీలో వారి వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించారు.

తెలంగాణ శాసనమండలి సభ్యులైన తాతా మధుసూధన్, ఎన్. నవీన్ కుమార్ రెడ్డిలను ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ప్రవేశపెట్టిన తీర్మానానికి మండలి ఆమోదం తెలిపింది.

సెప్టెంబర్ 7న అసెంబ్లీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్న సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అత్యంత దారుణమైన, అనుచిత వ్యాఖ్యలు చేశారని స్పీకర్...