భారతదేశం, సెప్టెంబర్ 24 -- బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ)తో తమ పార్టీ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉందని, ఈ మేరకు ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్‌కు తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ లేఖ రాసినట్లు ఒవైసీ తెలిపారు.

కిషన్‌గంజ్‌లో విలేకరులతో మాట్లాడిన ఒవైసీ.. మొత్తం 243 సీట్లలో తమ పార్టీ ఆరు స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని, వాటిని తమకు కేటాయించాలని తేజస్వి యాదవ్‌కు అక్తరుల్ ఇమాన్ లేఖ ద్వారా తెలియజేశారని చెప్పారు. అయితే, ఈ విషయంలో తేజస్వి యాదవ్ నిర్ణయం తీసుకోవాలని, ఒకవేళ తమతో పొత్తుకు ఆర్‌జేడీ సిద్ధపడకపోతే, ప్రజలు గమనిస్తారని ఒవ...