భారతదేశం, జనవరి 20 -- ఏపీని మించిన అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని, పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం అతిపెద్ద మార్కెట్ అవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు దావోస్‌లోని వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికపై అన్నారు. ఏపీకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పాలసీలు, పెట్టుబడులకు ఉన్న సానుకూల పరిస్థితుల్ని స్వయంగా పరిశీలించాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను చూశాకే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా మారుతుందని, అందులో ఏపీ మొదట నిలుస్తుందని అన్నారు. దావోస్ పర్యటనలో రెండో రోజు జరిగిన 'ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్' అంశంపై సీఐఐ బ్రేక్ ఫాస్ట్ సెషన్‌లో సీఎం ప్రసంగించారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఏపీ ఆకర్షించినట్టు చెప్పారు. గ్రీన్ ఎనర...