భారతదేశం, నవంబర్ 16 -- బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లో ఊహించని ట్విస్టులు, ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ జరగనుంది. ఈపాటికే నిఖిల్ నాయర్ ఎలిమినేటర్ కాగా ఇవాళ్టీ ఎపిసోడ్‌లో గౌరవ్ గుప్తా ఎలిమినేషన్‌ను చూపించనున్నారు. ఇదిలా ఉంటే, వీకెండ్‌లోని సండే రోజున నాగార్జున కంటెస్టెంట్స్‌కు వినోదం పంచుతాడని తెలిసిందే.

ఈ క్రమంలోనే ఇవాళ్టీ (నవంబర్ 16) ఎపిసోడ్‌లో హీరో నాగ చైతన్య ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ స్టేజీపై తండ్రికొడుకులు నాగార్జున, నాగ చైతన్య ఇద్దరి ప్రజెన్స్ అదిరిపోయింది. హైలెస్సా అనే పాటతో నాగ చైతన్య బిగ్ బాస్ స్టేజీపైకి ఎంట్రీ ఇచ్చాడు. నాగ చైతన్య రావడం చూసి కింగ్ నాగ్ షాక్ అయ్యాడు.

"మీకు తెలుసు నాకు యాక్టింగ్‌తోపాటు రేసింగ్ అంటే చాలా ఇష్టమని. నాలుగేళ్ల క్రితం ఇండియన్ రేసింగ్ లీగ్ అని ఒక ఫెస్టివల్ స్టార్ట్ అయింది. నేను హైద...