భారతదేశం, నవంబర్ 2 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ మరింత ఆసక్తికరంగా సాగుతోంది. వీకెండ్‌లో భాగంగా శనివారం వచ్చిన హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ ఆట తీరుపై రివ్యూ ఇచ్చారు. ఇక ఎనిమిదోవారం పూర్తి చేసుకున్న బిగ్ బాస్ నుంచి ప్రతివారం ఒకరు ఎలిమినేట్ అవుతూ వస్తున్న విషయం తెలిసిందే.

అలా ఇప్పటికీ శ్రేష్టి వర్మ, మనీష్ మర్యాద, ప్రియా శెట్టి, హరిత హరీష్, ఫ్లోరా సైని, శ్రీజ దమ్ము, భరణి శంకర్, గత వారం రమ్య మోక్ష ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. ఈ వారం ఎలిమినేట్ అయిన భరణి శంకర్ రీ ఎంట్రీ ఇచ్చి పర్మనెంట్ హౌజ్‌మేట్‌గా మారాడు.

దాంతో ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లో 15 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరికి బిగ్ బాస్ 9 తెలుగు 8వ వారం నామినేన్స్ నిర్వహించారు. బిగ్ బాస్ తెలుగు 9 ఈవారం నామినేషన్స్‌లో మొత్తంగా 8 మంది ఉన్నారు. వారిలో తనూజ గౌడ, కల్యాణ్ పడాల, రీతూ చౌదరి, ...