భారతదేశం, నవంబర్ 17 -- బిగ్ బాస్ తెలుగు 9 రణరంగం అన్నట్లుగానే సాగుతుంది. కంటెస్టెంట్ల ఆట తీరు ఎలా ఉన్న సీజన్‌లో మాత్రం ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అలా వరుసగా రెండు వారాలు బిగ్ బాస్ తెలుగు 9లో డబుల్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది.

బిగ్ బాస్ 9 తెలుగు పదో వారం కూడా డబుల్ ఎలిమినేషన్ జరిగిన విషయం తెలిసిందే. నాగార్జున వేసిన బిగ్ బాస్ బాంబ్ కారణంగా ఈ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే నిఖిల్ నాయర్ ఎలిమినేట్ అయ్యాడు. బుల్లితెర సీరియల్ గృహలక్ష్మీతో పాపులర్ అయ్యాడు నిఖిల్ నాయర్.

గృహలక్ష్మీ సీరియల్‌లో ప్రేమ్ పాత్రలో నిఖిల్ నాయర్ ఆకట్టుకున్నాడు. దాంతో నిఖిల్‌కు మంచి రెమ్యూనరేషన్ అందినట్లు సమాచారం. నిఖిల్ నాయర్‌ బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు వారానికి రూ. 2.5 లక్షల పారితోషికం ఇచ్చినట్లు టాక్. అక్టోబర్ 12న లాంచ్ అయిన బిగ్ బాస్ త...