భారతదేశం, నవంబర్ 10 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్‌లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి వారం ఒకరి ఎలిమినేట్ అవుతారని తెలిసిన విషయమే. అయితే, కొన్ని సార్లు డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంటుంది. అది కూడా పెద్ద ట్విస్ట్ ఏం కాదు. కానీ, సెల్ఫ్‌గా ఎలిమినేట్ అవడం అనేది ఊహించని పరిణామం.

అలాంటి బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లో తొమ్మిదో వారం చోటు చేసుకుంది. బిగ్ బాస్ 9 తెలుగు నుంచి ఫోక్ సింగర్ రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. దాంతో హౌజ్ మొత్తం భావోద్వేగానికి గురైంది. బిగ్ బాస్ తెలుగు 9 తొమ్మిదో వారం నామినేషన్స్‌లో రాము రాథోడ్ (Ramu Rathod) ఉన్నప్పటికీ అతనికి మంచి ఓటు బ్యాంక్ ఉంది.

కానీ, ఇంట్లోవాళ్లు గుర్తొస్తున్నారని, వాళ్లను వదిలి ఉండలేకపోతున్నాను కన్నీటి పర్యంతం అయిన రాము రాథోడ్ సొంతంగా ఎలిమినేట్ అయి హౌజ్‌ను వీడాడు. రాను రాను బొంబాయికి పాటతో ఫుల...