భారతదేశం, నవంబర్ 14 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ జోరుగా సాగుతోంది. మొత్తానికి బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లో పదో వారం కూడా అయిపోయేందుకు వచ్చేసింది. ఇప్పటికీ బిగ్ బాస్ హౌజ్ నుంచి 9 మంది ఎలిమినేట్ అయి వెళ్లిపోగా రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్‌తో, అనారోగ్యం కారణంగా ఆయేషా జీనత్ హౌజ్‌ను వీడి వెళ్లారు.

ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లో 11 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉన్నారు. వీరికి పదో వారం నామినేషన్స్ ప్రక్రియ నిర్వహించారు. బిగ్ బాస్ 9 తెలుగు పదో వారం నామినేషన్స్‌లో మొదటగా ఆరుగురు మాత్రమే నామినేట్ అయితే ఆ తర్వాత పదోవారం అందరూ నామినేషన్స్‌లో ఉంటారని బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

దాంతో ఒక్క ఇమ్మాన్యూయెల్ తప్పా మిగతా పది మంది కంటెస్టెంట్స్ అంతా బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక నామినేషన్స్‌లో ఉన్న గౌరవ్ గుప్త...