భారతదేశం, నవంబర్ 6 -- బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ తొమ్మిదో వారం మధ్యలోకి వచ్చేసింది. హౌజ్‌లో దెయ్యాలు, బిగ్ బాస్ టాస్క్‌లు, ఫోన్ కాల్స్‌తో ఆడుకోవడాలు, అరుపులు, వాగ్వాదాలతో జోరుగా సాగుతోంది ఈ సీజన్. అయితే, బిగ్ బాస్ 9 తెలుగు తొమ్మిదో వారం మిడ్ వీక్‌ రానే వచ్చింది. ఈ వారం కూడా ఒకరు ఎలిమినేట్ కానున్నారు.

ఇప్పటికే 8 మంది వరకు ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ నుంచి వెళ్లిపోయారు. వారిలో శ్రేష్టి వర్మ, మనీష్ మర్యాద, ప్రియా శెట్టి, హరిత హరీష్, ఫ్లోరా సైని, శ్రీజ దమ్ము, రమ్య మోక్ష, దివ్వెల మాధురి ఉన్నారు. ఎలిమినేట్ అయిన భరణి శంకర్ రీ ఎంట్రీ ఇచ్చి పర్మనెంట్ హౌజ్‌మేట్‌గా మారిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9లో 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారికి బిగ్ బాస్ 9 తెలుగు 9వ వారం నామినేషన్స్ నిర్వహించారు. ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌...