భారతదేశం, నవంబర్ 11 -- బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ పదో వారానికి చేరుకుంది. తొమ్మిదో వారంలో ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది. బిగ్ బాస్ 9 తెలుగు తొమ్మిదో వారం సింగర్ రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ కాగా.. నటుడు సాయి శ్రీనివాస అతి తక్కువ ఓటింగ్‌తో ఎవిక్షన్ అయి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

ఇద్దరి ఎలిమినేషన్‌తో బిగ్ బాస్ 9 తెలుగులో 11 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. వారికి కుర్చీలో పెట్టి బురద వేసే నామినేషన్ ప్రక్రియ పెట్టారు. బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నామినేషన్స్ పూర్తి అయిపోయాయి. ఈసారి సింగిల్ నామినేషన్స్‌తోనే కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.

ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని మాత్రమే నామినేట్ చేసే అధికారం ఇచ్చాడు బిగ్ బాస్. జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యూయెల్‌తో బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ ప్రారంభం అవుతుంది. భరణి శంకర్‌ను ఇమ్ము నామినేట్...