భారతదేశం, నవంబర్ 25 -- ఆంధ్రప్రదేశ్ రైల్వే మౌలిక సదుపాయాల కల్పనలో మరో భారీ ముందడుగు పడింది. అత్యంత రద్దీగా ఉండే చెన్నై-హౌరా ప్రధాన రైల్వే మార్గంలో ప్రయాణికుల, సరుకు రవాణా రైళ్ల రాకపోకలకు ఆటంకం కలగకుండా దక్షిణ కోస్తా రైల్వే (SCoR) కీలక నిర్ణయం తీసుకుంది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు నుంచి విశాఖపట్నం సమీపంలోని దువ్వాడ వరకు 151.08 కిలోమీటర్ల మేర 3వ, 4వ బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ల నిర్మాణానికి రూ. 4,299.12 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానించింది.

కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఏప్రిల్ 2026లో ఆమోదించిన నిడదవోలు-దువ్వాడ రైల్వే క్వాడ్రప్లింగ్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా ఈ పనులను చేపట్టనున్నారు. ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (EPC) విధానంలో చేపట్టే ఈ ప్రాజెక్టు విజయవాడ, విశాఖపట్నం రైల్వే డివిజన్ల పరిధిలో విస్తరించ...