భారతదేశం, నవంబర్ 1 -- దర్శక దిగ్గజం రాజమౌళి, ప్రభాస్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన 'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి: ది కంక్లూజన్' భారీ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఈ రెండు సినిమాలను ఒక్కటిగా మలిచి రూపొందించిన మూవీనే 'బాహుబలి ది ఎపిక్'.

ఎన్నో అంచనాలతో బాహుబలి ది ఎపిక్ మూవీ అక్టోబర్ 31న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి టాక్, రివ్యూలు తెచ్చుకుంటోంది. అలాగే, మూవీకి బాక్సాఫీస్ వద్ద బంపర్ ఓపెనింగ్స్ వచ్చినట్లు సమాచారం.

ట్రేడ్ అనలిస్ట్ సక్నిల్క్ ప్రకారం బాహుబలి ది ఎపిక్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ. 1.15 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో భారీ అడ్వాన్స్ బుకింగ్స్ అందుకున్న సినిమాగా బాహుబలి ది ఎపిక్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక విడుదలైన అక్టోబర్ 31న సేల్ అయిన టికెట్స్ ద్వారా రూ. 9.25...