భారతదేశం, నవంబర్ 19 -- హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లోని సాంకేతిక విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కీలక అడుగు పడింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మౌలిక సదుపాయాల సంస్థ 'బొండాడ ఇంజినీరింగ్ లిమిటెడ్'.. తెలంగాణలోని బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ - బాసర ట్రిపుల్ ఐటీ)తో బుధవారం (నవంబర్ 18న) అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలు, క్యాంపస్ నియామకాలు, దీర్ఘకాలిక కెరీర్ అవకాశాలను అందించే లక్ష్యంతో ఈ ఒప్పందాన్ని రూపొందించారు.

తెలంగాణలోని గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ విద్యను అందించే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థగా బాసర ఆర్‌జీయూకేటీకి పేరుంది. ఈ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థుల్ల...