భారతదేశం, జనవరి 20 -- ధురంధర్ బంపర్ విజయంతో బాలీవుడ్ లో కొత్త జోష్ నిండుకుంది. ఇప్పుడు ఆ మూవీ ఇండస్ట్రీ నుంచి మరో సంచలన సినిమా దూసుకోస్తోంది. సన్నీ డియోల్ నటించిన 'బోర్డర్ 2' ఈ వీకెండ్ లో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించే దిశగా దూసుకుపోతోంది. సోమవారం ప్రారంభమైన ఈ చిత్రం అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో అదరగొడుతోంది.

సన్నీ డియోల్, వరుణ్ ధావన్ తదితరులు కీలక పాత్రలు పోషించిన బోర్డర్ 2 మూవీ అడ్వాన్స్ టికెట్ సేల్స్ లో సత్తాచాటుతోంది. కేవలం 24 గంటల్లోనే సన్నీ డియోల్ గత బ్లాక్‌బస్టర్ 'జాట్' మొత్తం అడ్వాన్స్ బుకింగ్‌ను బోర్డర్ అధిగమించింది. ఇటీవల విడుదలైన 'ధురంధర్', పాన్-ఇండియా యాక్షన్ చిత్రం 'వార్ 2' లను కూడా ఇది దాటేసింది.

సోమవారం (జనవరి 19) ఇండియాలో 'బోర్డర్ 2' అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. మంగళవారం నాటికి, ప్రారంభమైన 24 గంటలు గడిచిన కొద్...