భారతదేశం, డిసెంబర్ 29 -- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా మెుదలయ్యాయి. సీఎం రేవంత్ రెజ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు అయ్యారు. కేసీఆర్ దగ్గరకు వెళ్లి రేవంత్ రెడ్డి బాగున్నారా అని అడిగారు. కాసేపటికే సభ నుంచి కేసీఆర్ వెళ్లిపోయారు. ఆ తర్వాత సభ కాసేపు నడిచింది. అసెంబ్లీని జనవరి 2వ తేదీ వరకు స్పీకర్ వాయిదా వేశారు.

అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మేడిగడ్డ ప్రాజెక్టు మాదిరిగానే హుజురాబాద్ నియోజకవర్గంలోని తనుగుల చెక్ డ్యాం బాంబులు పెట్టి పేల్చేశారని కౌశిక్ రెడ్డి అన్నారు.

దీంతో అసెంబ్లీలో ఆందోళన మెుదలైంది. పౌడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాంబులు పెట్టి పేల్చారని ఆరోపణలు చేయడం ఏంటని ఎదురుదాడికి దిగారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. రికార్డ...