భారతదేశం, అక్టోబర్ 10 -- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచే బతుకమ్మ పండుగ అక్టోబర్ 10, అంటే ఈరోజు నుంచి ప్రారంభమైంది. ప్రకృతిని, పూలను, స్త్రీశక్తిని ఆరాధిస్తూ మహిళలు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చుతారు. సంప్రదాయ పాటలు పాడుతూ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం జరుగుతుంది.

ప్రకృతి ఆరాధన: గునుగు, తంగేడు, బంతి, చామంతి లాంటి పూలతో బతుకమ్మను తయారు చేస్తారు.

గౌరీదేవి ఆరాధన: అమ్మవారిని పూలతో అలంకరించి, భక్తిశ్రద్ధలతో గౌరీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడడం జరుగుతుంది.

ఈ పండుగ తెలంగాణ ప్రజల సాంస్కృతిక గుర్తింపుకు ప్రత్యేకంగా నిలుస్తుంది.

తొమ్మిది రోజులు కూడా వివిధ రకాల బతుకమ్మలను తయారు చేసి అమ్మవారిని ఆరాధిస్తారు. మొదటి రోజు ఎంగిలిపూ...