Telangana, ఆగస్టు 8 -- ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. వాస్తవాలు తెలుసుకోకుండా, అసంబద్ధమైన, దిగజారుడు, థర్డ్‌క్లాస్ స్థాయి ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో చవకబారు పబ్లిసిటీ కోసం, మీడియా దృష్టిని ఆకర్షించడానికే ఈ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారన్నారు.

కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్‌కు నిఘా వ్యవస్థల పనితీరు, విధానాలపై కనీస అవగాహన, పరిజ్ఞానం, ఇంగిత జ్ఞానం కూడా లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బాధ్యత గల పదవిలో ఉండి ఇంత బేస్‌లెస్ ఆరోపణలు చేయడం ఆయన అజ్ఞానం, నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.

బండి సంజయ్ ఆరోపణల్లో ఒక్క శాతం నిజం ఉన్నా నిరూపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. తక్షణమే ఆ ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ ...