భారతదేశం, డిసెంబర్ 25 -- బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. షరీఫ్ ఉస్మాన్ హాదీ దారుణ హత్యతో దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలో, ప్రధాన సలహాదారు డాక్టర్ ముహమ్మద్ యూనస్‌కు హోం వ్యవహారాల్లో ప్రత్యేక సహాయకుడిగా ఉన్న ఖుదా బక్ష్ చౌదరి బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను బంగ్లాదేశ్ అధ్యక్షుడు తక్షణమే ఆమోదించినట్లు కేబినెట్ సెక్రటరీ షేక్ అబ్దుర్ రషీద్ ధృవీకరించారు.

ఖుదా బక్ష్ చౌదరి రాజీనామాకు అధికారికంగా కారణాలు తెలపనప్పటికీ, 'ఇంక్విలాబ్ మోంచో' (Inqilab Moncho) అనే సాంస్కృతిక ఉద్యమ సంస్థ ఇచ్చిన హెచ్చరికలే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఉస్మాన్ హాదీ హత్య వెనుక ఉన్న దోషులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని 'ఇంక్విలాబ్ మోంచో' ఆరోపించింది.

అల్టిమేటం: శనివారం హాదీ అంత్యక్రియల సందర్భంగా, ఆ సంస్థ సభ్య కార్యదర్శి అ...