Andhrapradesh, ఆగస్టు 17 -- దక్షిణ ఛత్తీస్‌గఢ్,దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణశాఖ తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. సోమవారం నాటికి వాయువ్య బంగాళాఖాతం. దానిని ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

వీటి ప్రభావంతో రానున్న రెండు మూడు రోజులపాటు కోస్తాలో చెదురుమదురుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా. కొన్నిచోట్ల ఈదురుగాలులు వీచే అవకాశం సూచనలున్నాయి. మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని అధికారులు సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోను పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని స్పష్టం చేశారు.

శనివారం సాయంత్రం ...