భారతదేశం, అక్టోబర్ 23 -- బంగాళాఖాతంలో కదలికలు వేగవంతమయ్యాయి. తూర్పుమధ్య, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే కొద్ది రోజుల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.

ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం అక్టోబర్ 24 నాటికి వాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 25న తీవ్ర వాయుగుండంగా, అక్టోబర్ 26 (సోమవారం) ఉదయానికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా రూపాంతరం చెందుతుంది.

ఆ తర్వాత రెండు రోజుల్లో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తూ ఉత్తరాంధ్ర, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీరాల వైపు దూసుకొస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ తుపాను ప్రభావంతో అ...