భారతదేశం, ఆగస్టు 12 -- వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ సూచన ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, అనకాపల్లి జిల్లాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ జిల్లాల ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌లో రెండుమూడు రోజులు వాతావరణం మేఘావృతమై, తేమతో కూడి ఉంటుంది. ఉత్తరాంధ్రలో సాయంత్రం నుండి రాత్రి వరకు జల్లులు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడుతుండగా, రాయలసీమలో చాలా వరకు పొడిగా ఉంటుంది. క్యుములోనింబస్ మేఘాల కారణంగా అకస్మాత్తుగా, స్వల్పకాలిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, యానాం, రాయ...