Andhrapradesh, ఆగస్టు 13 -- ఏపీలో గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇవాళ పశ్చిమమధ్య,వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 24 గంటల్లో ఇది మరింత బలపడనుంది. ఈ మేరకు వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం. రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల మీదుగా కదిలే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో నేడు, రేపు కోస్తా జిల్లాల్లో పలుచోట్ల అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు పడుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన ద్వారా పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మరోవైపు కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిప...