భారతదేశం, నవంబర్ 16 -- హీరోగా, విలన్‌గా చేస్తూ మెప్పిస్తున్నాడు ఆది పినిశెట్టి. సరైనోడు, ది వారియర్ సినిమాల తర్వాత మరోసారి విలన్‌గా అలరించేందుకు ఆది పినిశెట్టి చేస్తున్న సినిమా అఖండ 2. నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ 2 నుంచి రీసెంట్‌గా ది తాండవం సాంగ్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా అఖండ 2 ది తాండవం సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ఆది పినిశెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. బాలయ్య బాబు గారితో వర్క్ చేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్. బంగారం లాంటి మనసు ఉన్న మనిషి. బోయపాటి గారు బాలయ్య గారు తమన్ ఈ కాంబినేషన్‌లో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ఈ సినిమా సునామీ సృ...