భారతదేశం, జనవరి 22 -- వరుస లాభాలతో దూసుకెళ్తున్న బంగారం ధరలకు గురువారం (జనవరి 22) ఉదయం దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో కళ్లెం పడింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సద్దుమణిగే సంకేతాలు కనిపించడం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు (Profit Booking) మొగ్గు చూపడంతో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు, స్పాట్ మార్కెట్‌లో బలమైన డిమాండ్ కారణంగా వెండి మాత్రం తన జోరును కొనసాగిస్తోంది.

గురువారం ఉదయం 9:05 గంటల సమయానికి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ పెద్దగా మార్పు లేకుండా ఫ్లాట్‌గా రూ. 1,52,879 (10 గ్రాములు) వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం 0.90% మేర లాభపడి కిలోకు రూ. 3,21,343 వద్ద కొనసాగుతోంది. వెండికి పారిశ్రామిక డిమాండ్ తోడుకావడంతో దాని ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది.

అంతర్జాతీయ మార్కెట...