భారతదేశం, జనవరి 21 -- పసిడి ప్రియులకు ఇది కోలుకోలేని షాక్. ఇప్పటికే సామాన్యుడికి భారంగా మారిన బంగారం ధర, ఇప్పుడు సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య మొదలైన వాణిజ్య యుద్ధం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. దీని ప్రభావంతో బుధవారం (జనవరి 21) ఉదయం ఎంసీఎక్స్ (MCX) మార్కెట్లో బంగారం ధర కేవలం కొన్ని గంటల్లోనే దాదాపు రూ. 3,000 పెరిగి, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 10 గ్రాములు రూ. 1,53,316 మార్కును తాకింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి ఎనిమిది యూరోపియన్ దేశాల (డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్) ఉత్పత్తులపై 10 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాకుండా...