భారతదేశం, మార్చి 31 -- మార్చి 31, మంగళవారం నాడు దేశీయ మార్కెట్‌లో బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించగా, వెండి ధరలు మాత్రం కొద్దిగా పుంజుకున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నప్పటికీ, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో పసిడి ధరలు కాస్త శాంతించాయి. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో పసిడి ధరలు 0.41 శాతం వరకు క్షీణించాయి.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఏప్రిల్ 2 నాటి గోల్డ్ కాంట్రాక్టులు 10 గ్రాములకు Rs.1,45,051 వద్ద ట్రేడ్ అవ్వగా.. మే 5 నాటి సిల్వర్ కాంట్రాక్టులు కేజీకి 0.03 శాతం పెరిగి Rs.2,29,033 వద్ద కొనసాగాయి.

మరోవైపు, ఇండియన్ బులియన్ అసోసియేషన్ (IBA) డేటా ప్రకారం.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర Rs.1,47,510 గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల బంగారం ధర Rs.1,35,218 గా నమోదైంది. ఇక 999 స్వచ్ఛత కలిగిన వెండి కే...