Hyderabad, జూన్ 25 -- నెట్ఫ్లిక్స్ లోకి ఇప్పుడో రొమాంటిక్ కామెడీ మూవీ రాబోతోంది. మాధవన్, దంగల్ మూవీ ఫేమ్ ఫాతిమా సనా షేక్ జంటగా నటించిన ఈ సినిమా ట్రైలర్ బుధవారం (జూన్ 25) రిలీజైంది. ఈ మూవీ పేరు ఆప్ జైసా కోయి (Aap Jaisa Koi). సరదాగా సాగిపోయిన ఈ ట్రైలర్లో మాధవన్ ఓ సంస్కృతం టీచర్ గా నటించడం విశేషం.
నెట్ఫ్లిక్స్ ఓటీటీ గతంలోనే ఆప్ జైసా కోయి మూవీని అనౌన్స్ చేసింది. జులై 11 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసింది. ఓ సంస్కృతం టీచర్ గా పని చేసే శ్రీరేను (మాధవన్) అనే 39 ఏళ్ల వ్యక్తి.. పెళ్లి కోసం తంటాలు పడుతుంటాడు. ఓ మధ్యవర్తి ద్వారా 32 ఏళ్ల మధు అనే మరో టీచర్ ను అతడు కలుసుకుంటాడు.
అయితే సాంప్రదాయ కుటుంబానికి చెందిన శ్రీరేను, మోడర్న్ అమ్మాయి అయిన మధుకి అంత సులువుగా లింకు కలవదు. ఆమెతోపాటు ఆమె కుటుంబం కూడా చాలా ఆధునికం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.