భారతదేశం, సెప్టెంబర్ 2 -- చేతిలో ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయినట్లు అనిపిస్తోందా? నిమిషానికోసారి నోటిఫికేషన్లు చెక్ చేయడం అలవాటుగా మారిందా? నేటి డిజిటల్ యుగంలో పరికరాల ఉచ్చు నుంచి బయటపడటం దాదాపు అసాధ్యంగా మారింది. అయితే, ఈ డిజిటల్ ఊబి నుంచి బయటపడేందుకు 'డిజిటల్ డిటాక్స్' రిట్రీట్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. సెలవుల్లో ఫోన్లు, సోషల్ మీడియాకు దూరంగా గడిపేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

"డిజిటల్ డిటాక్స్ రిట్రీట్ మార్కెట్ 2026 నాటికి 1.65 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. 2030 వరకు ఇది 12.2 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా 67 శాతం మంది పర్యాటకులు ఇప్పుడు స్క్రీన్-ఫ్రీ అనుభూతులకే మొగ్గు చూపుతున్నారు" అని బెంగళూరులోని రామయ్య మెమోరియల్ హాస్పిటల్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ మహేంద్ర జేవీ త...